Custom Search

20


వేరుపురుగు చేరి వృక్షంబు జెఱచును
చీడపురుగు చేరి చెట్టు చెఱచు
కుత్సితుండు చేరి గుణవంతు చెఱచురా
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:

ఓ వేమా! ఓ మహా వృక్షమునకు అడుగు భాగాన చేరిన వేరు పురుగు ఆ వృక్షమును నాశనమవును. ఓ చీడ పురుగు చేత చెట్టు నాశనమవును, అటులనే దుర్మార్గుడు మంచివారిని చెడగొట్టునని భావము.