Custom Search

41


కులములో నొకండు గుణవంతుడుండిన
కులము వెలయు వాని గుణముచేత
వెలయు వనములోన మలయజం బున్నట్లు
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:

అడవిలో ఒక మంచి గంధపు చెట్టున్నను ఆ వాసన అడివి అంతయూ వ్యాపించునూ, అటులనే వంశములో ఒక్కడు ఉత్తముడు ఉన్ననూ వాని గుణముల చేత ఆ వంశమంతయూ మంచి పేరు పొందును.