Custom Search

61


ఆశచేత మనుజు లాయువు గలనాళ్ళు
తిరుగుచుంద్రు భ్రమను ద్రిప్పలేక
మురికి భాండమందు ముసురు నీఁగల భంగి
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:

జనులు ఆశచే ఆయుర్దాయము ఉన్నంతవరకు కోరికలను విడువలేక తిరుగుచుందురు. ఎట్లనగా దుర్వాసన కుండయందు ముసురు ఈగలవలె తిరుగుచుందురు వేమ!