Custom Search

14


అనువుగాని చోట నథికులమనరాదు
కొంచెముండుటెల్ల కొదువు గాదు
కొండ అద్దమందు కొంచమై యుండదా?
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:

మనకు తగని ప్రదేశములలో మనకు గల గొప్పతనము, ఆధిక్యత ప్రదర్శింపకపోయని మాత్రాన మన ఔన్నత్యమునకు భంగము కలుగదు కొండ ఎంత పెద్దదైననూ అద్దములో చిన్నదిగా కనిపించును కదా!