Custom Search

7


ఓం నమ:శ్శివాయ యని నోట బలుకుచు
శివునిపై జ్ఞప్తుంచి స్మరణ జేయు
జగతి నీ నరులకు జన్మసాఫల్యమౌ
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:

నోరారా 'ఓం నమశ్శివాయ!' అంటూ స్మరిస్తూ పరమశివునిపై మనసునిలిపి ధ్యానించిన మానవులకు జన్మ సాఫల్యం కలుగుతుంది.