Custom Search

34


ప్రియములేని విందు పిండివంటల చేటు
భక్తి లేని పూజ ప్రతి చేటు
పాత్ర మొఱుగనీవి బంగారు చేటురా
విశ్వదాభిరామ వినుర వేమ !

తాత్పర్యము:

ప్రేమలేని అన్నసంతర్పణము నందు వంటకములు వ్యర్ధము. బంగారము అపాత్రత గల దానిచ్చి సొమ్ముల చేయమంటే బంగారము వన్నె తగ్గును. ఆ రీతిగానే దేవునిపై గుఱిలేని పూజ పత్రి పరము వ్యర్థమని భావము