Custom Search

69


కోతినొనరదెచ్చి కొత్తపట్టముగట్టి
కొండముచ్చు లెల్ల గొలిచినట్లు
నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యము:

జ్ఞానము లేని వారి వద్ద భాగ్యము లేని వారు ఉండలేరు. ఎట్లనగా కోతిని తెచ్చి నూతనముగా రాజ్యాభిషేకము చేసి, కొండముచ్చు లెల్ల వానిని కొలిచినట్లుగా ఉండును.