Custom Search

72


మైలకోక తోడ మాసిన తలతోడ
ఒడలు ముఱికి తోడ నుండెనేని
అగ్రకులజు డైన నట్టిట్టు పిల్వరు
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యము:

మురికి గుడ్డలతో గాని,మాసిన శిరస్సుతో కాని,శరీరము నందు దుర్గంధముతో గాని ఉన్నచో అగ్రకులజుడైననూ పంక్తి వద్దకు ఆహ్వానించరు వేమా.గౌరవముగా చూడరని భావము.

0 comments: