Custom Search

66


విడువ ముడువ లేక కుడువగట్టగలేక
వెరపులేక విద్యవిధము లేక
వెడలలేనివాని నడపీను గనరొకో
విశ్వదాభిరామ వినురవేమ !

తాత్పర్యము:

సమయంకూ సందర్భాలకూ తగినట్టుగా పట్టువిడుపులు ప్రదర్శించలేని అలౌక్యుడూ, ధనం సంపాదించి కూడా ఆప్తులని ఆదుకోలేనివాడు, లోకములోని మంచి చెడులకు భయపడనివాడు, విద్యాహీనుడూ, నలుగురిలో కలసి మెలసి మెలగలేని వాడు, క్రమ పద్దతి లేని వాడు నడిచే పీనునిగా పరిగణించబడతాడు

0 comments: