Custom Search

65


ఇమ్ము దప్పువేళ నెమ్మెలెన్నియు మాని
కాల మొక్కరీతి కడపవలయు
విజయుఁడిమ్ము దప్పి విరటుని కొల్వఁడా
విశ్వదాభిరామ వినుర వేమ !

తాత్పర్యము:

పంచ పాండవులందు గల అర్జునుడు విరటుని కొలువుయందు ఉండలేదా? అట్లే స్థానము దప్పినప్పుడు విషయ వాంచను, దిగులును, విడచి కాలమును గడుపవలెను. జీవన మార్గమును అన్వేషించి బ్రతుకుట మంచిదని వేమన పలికిన భావము.

0 comments: