Custom Search

58


పూర్వజన్మమందు పుణ్యంబు చేయని
పాపి తా ధనంబు బడయలేదు
విత్తమరచి కోయ వెదకిన చందంబు
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము :

పూర్వ జన్మలో ఒక్క పుణ్యకార్యము కూడా చేయకుండా ఈ జన్మలో ధనదాహాలతో తులతూగాలని స్వర్గ సుఖాలను అనుభవించాలని కోరుకున్నమాత్రమున అవి లభిస్తాయా ? విత్తనము నాటకుండా పంటకు ఆశపడటం ఎంత అజ్ఞానమో పుణ్య కార్యములు చేయకుండా భోగ భాగ్యాలు కోరుకోవటం అంతే అజ్ఞానము.

0 comments: