Custom Search

57


మేఁక కుతికపట్టు మెడచన్ను గుడవఁగా
ఆక లేల మాను నాశగాక
లోభివాని నడుగ లాభంబు లేదయా
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:

మేకయొక్క మెడచన్ను పట్టూకొని కుడిచినచో ఆకలి తీరదు. పాలు లభించవు. అట్లే లోభివానిని అడిగి ప్రయోజనము లేదని వేమన పలికిన భావము.

0 comments: