Custom Search

54


త్రాడు పామటంచు దాజూచి భయపడు
దెలిసి త్రాడటన్న దీరు భయము
భయము తీరినపుడె బ్రహ్మంబు తానగు
విశ్వదాభిరామ వినుర వేమ !

తాత్పర్యము:

తాడును పాముగా చూచి భయపడతాడు మానవుడు. అది త్రాడు అన్న నిజం తెలియగానే భయము తీరి సత్యాన్ని గ్రహిస్తాడు. భయము తీరి సత్యాన్ని గ్రహించినవాడే బ్రహ్మమౌతాడు.

0 comments: