Custom Search

52


నీళ్ళ లోన మీను నిగిడి దూరము పారు
బైట మూరెఁడైన బారలేదు
స్థానబల్మిగాని తనబల్మి కాదయా
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:

నీటియందు చేప ఎంతదూరమైనా పోగలదు, భూమియందు మూరెడైననూ పోలేదు.చేపకు ఆ బలము స్థానము వలన వచ్చినది కానీ తన స్వంత బలము కాదని భావము.

0 comments: