Custom Search

50


కానివానితోడ గలసి మెలఁగుచున్నఁ
గానివానిగానె కాంతు రవనిఁ
దాటి క్రిందఁబాలు త్రాగిన చందమౌ
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:

గౌరవము లేని వారుతో తిరుగుచున్న ప్రజలు గౌరవము లేనివాడిగానే గుర్తించెదరు, ఎట్లనగా తాటి చెట్టుక్రింద పాలు త్రాగుచున్ననూ కల్లు త్రాగుచున్నారని భావించగలరు గదా.

0 comments: