Custom Search

48


నీచగుణములెల్ల నిర్మూలమైపోవు
కొదవలేదు సుజన గోష్ఠి వలన
గంధ మలద మేనికంపదగినయట్లు
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:

సుగంధ భరితమైన చందనాన్ని శరీరానికి పూసుకుంటే ఎటులైతే దేహానికుండే దుర్గంధం ఎలా దూరమౌతుందో అలాగే సుజన గోష్ఠి వలన మనలోని చెడు గుణాలన్నీ దూరమైపోతాయి. అందు చేత సదా సజ్జన సాంగత్యాన్నే కోరుకోవాలి.

0 comments: