Custom Search

47


పాలు పంచదార పాపర పండ్లలోఁ
జాల బోసి వండఁ జవికిరాదు
కుటిల మానవులకు గుణమేల కల్గురా
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:

చేదు గల పండ్లలో పాలు పంచదార పోసి వంటకము చేసిననూ చేదు గుణములు ఎట్లుండునో, అటులనే మంచి గుణములు ఎంత ఉపదేశించిననూ కుటీలుడు దుర్గణములు వీడడని భావము.

0 comments: