Custom Search

46


ఎద్దుకైనఁగాని యేడాది తెల్పిన
మాట దెలసి నడుచు మర్మ మెఱిఁగి
మొప్పె తెలియలేడు ముప్పదేండ్లకునైన
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము :

బండిలాగు ఎద్దుకైననూ ఒక సంవత్సరము తర్పీదు ఇస్తే మాటలు గ్రహించి నడుచుకొనెను. మూఢుడకు మాత్రము ముప్పై ఏండ్లకైననూ నేర్వలేడు. మార్చుకోడు తన మూర్ఖత్వము అని వేమన పలికిన భావము .

0 comments: