Custom Search

45


నీళ్ళ మీద నోడ నిగిడి తిన్నగ బ్రాకు
బైట మూరెడైనఁబాఱలేదు
నెలవు తప్పుచోట నేర్పరి కొరగాఁడు
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:

పడవ నీటి యందు చక్కగా నడుచును. భూమి మీద మూరెడైననూ పోజాలడు. అట్లే తన స్ధానబలము లేకున్నచో బుద్ధిమంతుడైననూ మంచిని గ్రహింపలేరు.

0 comments: