Custom Search

44


అల్పజాతి వాని కధికార మిచ్చిన
దొడ్డవారి నెల్ల దోలి తిరుగుఁ
జెప్ప దినెడి కుక్క చెఱుకు తీపెరుగునా
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము :

అల్ప బుద్ది వానికి అధికారము కట్టబెట్టినచో రాజ్యమునందు మంచివారిని వెళ్ళగొట్టును. ఏలనగా చెప్పులు తినెడి కుక్కకు చెఱుకు రుచి ఎరుగదు కదా.

0 comments: