Custom Search

43


విద్యలేనివాడు విద్వాంసుచేరువ
నుండగానె పండితుండుగాడు
కొలని హంసలకడ గొక్కెరలున్నట్లు
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:

విద్యలేని వాడు విద్వాంసుల దగ్గర ఉన్నంత మాత్రమున వాడు ఎప్పటికీ విద్వాంసుడు కాలేడు. సరోవరంలో రాజహంసల సమూహములో కొంగ ఉన్నంత మాత్రమున అది రాజ హంస అవుతుందా?

0 comments: