Custom Search

42


హీనగుణమువాని నిలు సేరనిచ్చిన
ఎంతవానికైన నిడుము గులుగు!
ఈఁగ కడుపు జొచ్చి యిక్కట్టు చేయదా
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:

చెడ్డవానికి ఆశ్రయమిచ్చి ఇల్లు చేర్చినచో, నెంతటివానికైననూ కడుపులో ఈగ, పురుగులు ప్రవేశించి బాధ పెట్టు విధముగా ఆపదలు కలుగ జేయును.

0 comments: