Custom Search

39


చంపదగినయట్టి శత్రువు తన చేత
చిక్కినేని కీడు చేయరాదు
పొసగ మేలుచేసి పొమ్మనుటే మేలు
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము :

ఓ వేమా! చంపతగిన వాడైన శత్రువు తన చేతిలో చిక్కినప్పుడు అతనిని చంపక మేలు చేసి పొమ్మనుటనే మేలు. అదే అతనికి శిక్ష అగును.

0 comments: