Custom Search

38


పంది పిల్ల లీను పదియు నైందింటిని
కుంజరంబు లీను కొదమ నొకటి
యుత్తమ పురుషుండు యొక్కడు చాలడా
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:

పంది ఒకేసారి పదునైదు పిల్లలను కనును. కానీ గొప్పదైన ఏనుగు ఒక్క పిల్లనే కనును, పెక్కు సంతానము కంటే గుణవంతుడగు ఒక్కడు మేలని భావము.

0 comments: