Custom Search

37


పూజకన్న నెంచ బుద్ధి నిదానంబు
మాటకన్న నెంచ మనసు దృఢము
కులముకన్న నెంచ గుణము ప్రధానంబు
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:

దేవుని పూజల కంటే నిశ్చలమైన బుధ్ధి ఉండుట మంచిది. మాటలు చెప్పుట కంటే నిశ్చలమైన మనస్సు కలిగియుండుట మంచిది. కులము యొక్క గొప్పతనము కంటే ఆ మనిషి యొక్క మంచితనము ముఖ్యము.

0 comments: