Custom Search

36


నేరనన్నవాఁడె నేర్పరి మహిలోన
నేర్తునన్నవాఁడు నిందఁజెందు
ఊరకున్నవాఁడె యుత్తమ యోగిరా!
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:

తెలివికలవాడు తనకేమియును తెలియుదని నిదానముగా మాట్లాడును. తెలియునన్నచో వాదించెదరు. అపకీర్తి రావచ్చును. గాన ఋషివలే మౌనముగా ఉండును. తెలివి తక్కువ వాడు అన్నియూ తెలిసినట్టు నటనచేయుచూ చివరకు అవమానము పొందును

0 comments: