Custom Search

35


మిరెము గింజ చూడు మీఁద నల్లగనుండు
కొఱికి చూడ లోనఁజుఱుకు మనును
సజ్జనులగువారి సార మిట్లుండురా!
విశ్వదాభిరమ వినుర వేమ !

తాత్పర్యము:

మిరియపు గింజ పైకి నల్లగా యుండిననూ కొరికి చూచినచో కారముగా మంట గలుగును. అటులనే మంచి వాడు పైకి చూచుటకు అలంకారముగా లేకపోయినా, లోపల మేధా సంపత్తి నిండి యుండునని భావము

0 comments: