Custom Search

28


పనస తొనలకన్న పంచదారలకన్న
జుంటితేనెకన్న జున్నుకన్న
చెరుకు రసముకన్న చెలుల మాటలె తీపి
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము :

పనస తోనలు, పంచదార, తేనె, జున్ను, చెరుకు రసములకన్ననూ యువతుల మాటలే మిక్కిలి మధురముగా ఉంటాయి అని భావము.

0 comments: