Custom Search

27


ముష్టి వేపచెట్టు మొదలుగా బ్రజలకు
పరగ మూలికలకు పనికివచ్చు
నిర్దయుండు ఖలుడు నీచుడెందులకగు ?
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:

విషవృక్షమైన ముష్టి, అమిత చేదుగా వుండు వేప కూడ ఔషదరూపంగా నైనా లోకానికి ఉపయోగపడతాయి. కాని దుర్మార్గుడు సంఘానికి ఏవిధముగా నైననూ ఉపయోగపడడు కదా హాని కూడా చేస్తాడు అని వేమన పలికిన భావము.

0 comments: