Custom Search

25


ఎరుగు వాని దెలుప నెవ్వడైనను జాలు
నొరల వశముగాదు ఓగుదెల్ప
యేటివంక దీర్ప నెవ్వరితరమయా?
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:

తెలుసుకోవాలని జిజ్ఞాసగలవారికి తెలియజెప్పడం అందరికీ సులభమే. మూర్ఖునికి తెలియ చెప్పటం ఎవరి తరం కాదు. ఏటి కుండే ప్రకృతి సిద్దమైన వంపును సరిచేయడం ఎవరికి సాధ్యమౌతుంది? అలాగే మూర్ఖునుని కూడ సరి చేయలేమని వేమన పలికిన భావము.

0 comments: