Custom Search

24


జీవిజంపుటెల్ల శివభక్తి తప్పుటే
జీవునరసి కనుడు శివుడె యగును
జీవుడు శివుడను సిద్ధంబు తెలియరా
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:

జీవుడికి, శివుడికి మధ్య భేదం లేదు. తరచి చూస్తే జీవుడే శివుడు, శివుడే జీవుడు. ఏ జీవినీ హీనంగా చూడరాదు. జీవిని చంపటమంటే శివభక్తిని తప్పినట్లే అని వేమన పలికిన భావము.

0 comments: