Custom Search

23


పనుల వన్నెవేరు పాలెల్ల ఒక్కటి
పుష్పజాతి వేరు పూజ ఒకటి
దర్శనంబులారు దైవంబు ఒక్కటె
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:

పశువులు వేర్వేరు రంగులలో ఉన్నప్పటికీ అవి ఇచ్చే పాలు అన్నీ తెల్ల రంగులలోనే ఉంటాయి. పువ్వులు రకరకాల జాతులు ఉండిననూ వాటిచే చేయబడే పూజ ఒక్కటే. అటులనే కనపడుటకు ఎన్ని రూపాలున్ననూ దైవం ఒకటే అని వేమన పలికిన భావము

10 comments:

, said...

మీ ప్రయత్నం చాలా శ్రమకోరిస్తే గాని పూర్తవనిది!అది స్వయంగా చేస్తేగాని తెలీదు!ఇలాంటివాటికసలు స్పందనే వుండదు, ఉబుసుపోక చెప్పుకునేవాటికి రేటింగులంటూ మన సాంస్కృతిక వారసత్వాన్ని మరిచిపోతున్నారు. మీ ప్రయత్నం మంచి ఫలితాన్నిస్తుంది! Maybe u can make these total articles into a softcopy (PDF) after its completion.
Any way keep it up

Anonymous said...

పర్లేదు శ్రీధర్ గారు .....

నా మొదటి బ్లాగు కన్నా...

ఈ బ్లాగు నాకు చాలా నచ్చింది ....
ఈ పద్యాలు ఎవరికన్న ఉపయోగపడితే అదే చాలు

Anonymous said...

@sridhar
ఇది మంచి ప్రయత్నమని అందరూ ఒప్పుకున్నదే,ఇంకా ఏమని కామెంట్ ఇవ్వాలని మీ ఉద్దేశం? పద్యం బాగా రాసారు అనా?
ఉబుసుపోక-రాసిన వాటి్ల్లో శైలి ,విషయం,ఆ సొంత అనుభవాలు మెదలైనవి నచ్చి,పోల్చుకుని కామెంట్ ఇచ్చుండొచ్చు.మీర్రాసేది ఉబుసుపోక కాదా?

, said...

మంచి ప్రయత్నమని వొప్పుకోటానికి ఎంత నామోషియో మనుషులకి! పేరుతో కాకుండా Anonymousగా రాసినప్పుడే అర్థం అవుతుంది ఎందుకు భయపడుతున్నారో?
భజనకారులు కాకపోతే Anonymous గా ఎందుకు?

Rajendra Devarapalli said...

అశ్విన్ గారు నేను గతంలో చెప్పినట్లు మీరు ఎంతో అభినందనీయమైన కృషి చేస్తున్నారు.వేమన మన జాతీయ వారసత్వం ,మన సంపద.వేమన పద్యాలు ఒకరోజు చదివి అవతల పారేసేవి కావని నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను.జీవితంలో ఎదురయ్యే ప్రతి సంధర్భానికి అన్వయించుకోగలిగే పద్యపరంపర వేమనది.

కేవలం వేమన పేరుతో ఎంతో ఎత్తుకు అంటే ఉద్యోగపరంగా,ఎదిగిన వారు చాలా మంది ఉన్నారు.నిస్సందేహంగా మీరు ఆకోవలోకి రారు.మీరు కొవ్వొత్తి లేదా కరివేపాకు విభాగంలోకి వస్తారు.


ఇటీవల ఒక బుక్ ఎగ్జిబిషన్లో వేమన శతకాలు చాలా వెర్షన్లు చూసాను.నాలుగు రూపాయలనుంచి ఉన్నాయి వాటి ఖరీదు. అలాగే మీరు ఎవరి పుస్తకాన్ని ప్రమాణంగా తీసుకున్నారో,మీకు స్ప్పూర్తి,ప్రేరణ ఎవరో ఒక్కసారి రాస్తే మేమూ చదివి సంతొషిస్తాం.

Anonymous said...

@రజేంద్ర గారు ...
ముందుగా నమస్తే, నా దగ్గర అనేక వేమన పుస్తకాలున్నయ
పెద్దబాలశిక్ష, JP publications వారి వేమన పద్య రత్నవళి, ఇంకా ఇలంటివి ఏవో.....

ఇప్పుడు నెట్ ప్రపంచములో వంకాయ కూర ఏల చెయ్యలో నుండీ ప్రతీది దొరుకుతుంది.

కాని మొన్న రాత్రి నాకు వేమన పద్యాలు చూద్దామంటే అసలు అన్నీ ఒకచోట లేవు.

ఇలా కాదు మన తెలుగు బ్లాగర్లు ఉన్నరని, తెలుగు బ్లాగు లూ ఉన్నయి అని ఈ బ్లాగు మొదలుపెట్టను. నెట్ ప్రంచములో దొరికే Quick ref గా అన్నా పనికొస్తే అదే చాలండి. సాధ్యమైనంతవరకు తప్పులేకుండా పద్యాలిస్తే, ఓ బ్లాగు ఉందని తెలిస్తే, తర్వాత జీవితములో ఎప్పుడైన, ఎవరికన్న పనికొస్తుందనుకుంటున్నను. ఇంకా ఆ ప్రత్నములో మొదలుపెట్టినది ఈ బ్లగు .

lalithag said...

Please see this.
http://andhrabharati.com/shatakamulu/vEmana/index.html

Also, please visit this and comment.
http://telugu4kids.com/Padyalu.aspx

Anonymous said...

lalitha gaaru

aMdrabhaaratilO vi nenu choosanaMdi

kaani bhaavamu lEdu

mriyoo 276 padyaalE unnayi

kadaMDI....

lalithag said...

అశ్విన్ గారు,
ఆంధ్రభారతి వారి సేకరణ చూసి చాలా పద్యాలు అనుకున్నాను. అవీ తక్కువేనని నాకు తెలియదు. ఎన్నుండచ్చు అంటారు, authentic గా వేమన వ్రాసిన పద్యాలు?

నా వంతు కృషిగా, ఆంగ్లంలో అనుకోండి, మా పిల్లల వంటి వారికి అర్థమయ్యేలా, నాకు బాగా అర్థమైన పద్యాలు కొన్ని తెలుగు4కిడ్స్ లో పెట్టాను. పైన ఆ లంకె కూడా ఇచ్చాను. చూసి అభిప్రాయం తెలియ చేస్తారేమో అని.

Anonymous said...

తెలుగు kids కూడా చూశామండీ....
వంక పెట్టాను అనుకోక పోతే చిన్న సలహా...
wmv format లో కన్నా flash lO ayithE tvaragaa లోడ్ అవుతాయి ...
ఏదిఏమైనా మీ ప్రయత్నం అబినందించాల్సినదే...

వేమనవి పద్యాలు సుమారు ౩౦౦౦ పై మాటే....

వాటిలో ఓ వంద ని శతకము అన్నరు ...