Custom Search

17


నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగబట్టు
బయట కుక్కచేత భంగపడును
స్థానబలిమిగాని తన బల్మిగాదయా
విశ్వదాభిరామ వినుర వేమ !

తాత్పర్యము:

ఓ వేమా! నీటిలోన ముసలి చిన్నదైననూ ఏనుగును సైతమూ చంపగలదు, కానీ అదే ముసలి తన స్థానమైన నీటినుండీ బయటకు వచ్చినచో కుక్క చేతిలో ఓడిపోవును, మొసలికి ఆ బలము స్థానము వలన వచ్చినది కానీ తన స్వంత బలము కాదని భావము.

0 comments: