Custom Search

16


తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలేని చదలు పుట్టవా గిట్టవా
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:

ఓ వేమా! తలిదండ్రులపై దయ లేని పుత్రుడు పుట్టినను, చచ్చినను ఒకటే. పుట్టలలో పుట్టి ఎవరికి ఉపయొగములేక ఆ పుట్టలోనే చచ్చెడు చెదపురుగుల వలె తలిదండ్రులపై ప్రేమలేని కుమారుని జన్మము వ్యర్ధము కదా!

0 comments: