Custom Search

18


మేడిపండు చూడు మేలిమై యుండును
పొట్టవిచ్చి చూడు పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:

ఓ వేమా! పైకి మేడిపండు ఎఱ్ఱగా పండి చక్కగా కంపించు చుండును. దానీని చీల్చి చూడగా పొట్టలో పురుగులుండును. పిరికి వాడు పైకి గాంభీర్యముగా ఉండిననూ మేడిపండు వలే లోపల పిరికితనము కలిగియుండునని భావము.

0 comments: