Custom Search

14


అనువుగాని చోట నథికులమనరాదు
కొంచెముండుటెల్ల కొదువు గాదు
కొండ అద్దమందు కొంచమై యుండదా?
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:

మనకు తగని ప్రదేశములలో మనకు గల గొప్పతనము, ఆధిక్యత ప్రదర్శింపకపోయని మాత్రాన మన ఔన్నత్యమునకు భంగము కలుగదు కొండ ఎంత పెద్దదైననూ అద్దములో చిన్నదిగా కనిపించును కదా!

1 comments:

Anonymous said...

తాత్పర్యంతో పాటూ మీ వ్యాఖ్య కూడా వ్రాయండి. ఇప్పటి కాలానికి ఈ పద్యం ఎలా అన్వయిచచ్చో ఓ పంక్తిలో చెబితే ఇంకా నిండుదనం వస్తుంది టపాకు. కామము, మూర్ఖులు, అనాచారాలకు సంబంధించిన పద్యాలు చాలా బాగుంటాయి.
కుడితిలో చక్కెర కలిపి తాగితే తీయగా ఉంటుందంట..అలాగే..పతితలతో ................కూడా అలాంటిదే అంటాడు. వహ్వా..వాటె కంపారిజన్. ఇది చదివిన తరువాత మనిషన్నవాడు ఆ తప్పుడు ఆలోచన చేస్తాడా!