Custom Search

13


నిక్కమైన మంచినీల మొక్కటి చాలు
తళుకుబెళుకు రాళ్ళు తట్టెడేల?
చాటు పద్యములను చాలదా ఒక్కటి
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:

ఓ వేమా! నిజమైన మంచి నీలమణి ఒక్కటే చాలును. అంతేగాని ఊరకమెరిసెడి గాజురాళ్ళు తట్టెడు ఉన్నను వ్యర్ధమే. చాటు పద్యమును ఒక్కటి విన్ననూ చాలును కదా! అనేక రసహీన పద్యములను విన్ననూ నిరుపయోగమే.

0 comments: