Custom Search

10


మనసునందు ముక్తి మఱియెఱుంగఁగలేక
మనసు చేతఁ దగిలి మాయమైరి
మనసుతానెయైన మర్మజ్ఞుఁడుగు యోగి
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:

మనస్సునందే వున్న ముక్తిని తెలియక, మనసు మాయలో పడి చాలా మంది గతించారు. కానీ మనసులోనున్నది తానేయని గుర్తించినవాడు యోగి.

0 comments: