Custom Search

62


నీళ్ళలోని మీను నెఱిమాంస మాశించి
గాలమందు జిక్కుకరణి భువిని
ఆశ దగిలి నరుడు నాలాగె చెడిపోవు
విశ్వదాభిరామ వినుర వేమ !

తాత్పర్యము:

నీటియందు చేప మాంసము ఆశించి గాలమునకు ఎటులయితే చిక్కునో అటులనే భువిని యందు నరుడు కూడ నీటిలోని చేప వలె జీవించి, నశించునని భావము.

0 comments: