Custom Search

21


కుండ కుంభమండ్రు కొండ పర్వతమండ్రు
యుప్పు లవణమండ్రు యొకటి గాదె?
భాషలింతె వేఱు పరతత్వమొక్కటే
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:

సంస్కృతములో కుండను కుంభం అంటారు, ఉప్పును లవణం అంటారు, కొండను పర్వతము అంటారు . ఇక్కడ భాష మాత్రమే వేరు కాని భావము ఒక్కటే. అదే విధముగా మతాలు వేరైనా మనుష్యులొక్కటే అని వేమన పలికిన భావము.

0 comments: