Custom Search

20


వేరుపురుగు చేరి వృక్షంబు జెఱచును
చీడపురుగు చేరి చెట్టు చెఱచు
కుత్సితుండు చేరి గుణవంతు చెఱచురా
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము:

ఓ వేమా! ఓ మహా వృక్షమునకు అడుగు భాగాన చేరిన వేరు పురుగు ఆ వృక్షమును నాశనమవును. ఓ చీడ పురుగు చేత చెట్టు నాశనమవును, అటులనే దుర్మార్గుడు మంచివారిని చెడగొట్టునని భావము.

4 comments:

విహారి(KBL) said...

వేమన పద్యాలని సేకరించి తెలుగు సాహిత్యానికి నిజమైన సేవ చేస్తున్నారు.నేను ఇంతవరకు చూడనేలేదు.నిజంగా హాట్సాఫ్.

తెలుగు'వాడి'ని said...
This comment has been removed by the author.
తెలుగు'వాడి'ని said...

మీ ప్రయత్నం బహుధా ప్రశంశనీయం. అభినందనలు.

చిన్న సూచన/సలహా (సహృదయంతో స్వీకరించ (ప్రార్ధన) గలరనే నమ్మకంతో) : ఇలా సాహిత్యానికి మొదలగు వాటికి సంబంధించినంతవరకు సాధ్యమైనంతవరకు అక్షరాలలో గానీ, తాత్పర్యంలో వాడే పదాలలో గానీ తప్పులు లేకుండా ఉంచటానికి ప్రయత్నం చేయండి. లేదా సరిచేయమని చెప్పే వ్యాఖ్యలు వచ్చినప్పుడు వీలుచూసుకొని మార్చినా ఫర్వాలేదు.

ఉదా : వేరు ... నాశనము చేయును ... చెడగొట్టునని

Unknown said...

--తెలుగు వాడు

నేను కూడ ప్రయత్నిస్తున్ననండీ ....
కానీ తప్పట్లేదు , ఈ సారి మరింత జాగ్రత్తగా తప్పులు దొర్ల కుండా చూసుకుంటాను...